మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్లు.! ఏపీకే ఫైల్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్లలోకి మాల్వేర్

మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్లు.! ఏపీకే ఫైల్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్లలోకి మాల్వేర్
  • ఏపీకే ఫైల్స్ పంపి, హ్యాకింగ్​కు యత్నం 
  • ఎస్​బీఐ, ఆధార్ అప్​డేట్ పేరుతో మెసేజ్​లు 
  • ఏపీకే ఫైల్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్లలోకి మాల్​వేర్ 
  • ప్రజల అకౌంట్లు, గ్రూపుల్లోకీ ఏపీకే ఫైల్స్  
  • హ్యాక్ అయితే ఫోన్ ఓవర్​హీట్.. బ్యాటరీ చార్జ్ వేగంగా ఖాళీ 
  • వాట్సాప్‌‌‌‌లో టూ స్టెప్‌‌‌‌ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి 
  • ఫోన్​లో కాల్‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌ను  డిజేబుల్ చేసుకోవాలని పోలీసుల సూచనలు   

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజలతోపాటు నేతలు, మంత్రులను టార్గెట్‌‌‌‌ చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ చలాన్స్‌‌‌‌, ఆర్టీఏ, పీఎం కిసాన్‌‌‌‌ యోజన, ఎస్‌‌‌‌బీఐ రివార్డ్స్‌‌‌‌తో పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ ప్యాకేజీ/.apk) ఫైళ్లను పంపి అకౌంట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ఎంటరయ్యారు. మంత్రులు ఉన్న గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపి, హ్యాకింగ్ కు ప్రయత్నించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ముందుగా ఓ జర్నలిస్ట్ ఫోన్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. అతడి ఫోన్ లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ ను పంపించారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంకు అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేవైసీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని.. వెంటనే ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని లేదంటే బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని చేయదని భయపెట్టారు. మంత్రులు వినియోగించే అధికారిక గ్రూపులు, సీఎంవో, డిప్యూటీ సీఎం గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మీడియా గ్రూపుల్లో ఇలాంటి ఏపీకే ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్క్యులేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అధికారిక గ్రూపుల్లో వచ్చిన ఫైల్స్ కావడంతో ఏపీకే లింకులను ఓపెన్ చేసిన మంత్రుల పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు, ఆయా డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన జర్నలిస్టుల ఫోన్లలోకి మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఎంటర్ అయింది. 

ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వెంటనే.. 

సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైళ్ల రూపంలో మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వారి మొబైల్ ఫోన్లను హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూపులను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూపుల్లోని కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నింటికి బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏపీకే ఫైల్స్ లింకులు పంపిస్తున్నారు. హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఇతర వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోకి వెళ్లి ఆ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చడం.. అదే వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇతరులకు మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రూపంలో మరికొన్ని ఏపీకే ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపడం ద్వారా మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లను హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇలా మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. 

కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐఫోన్లు హ్యాక్.. 

ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగదారులను సైతం కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 21 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ # లాంటి నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని చెబుతున్నారు. నిజానికి ఇది కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీలు, వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 
కాకుండా సైబర్ నేరగాళ్లకు వెళ్తుంటాయి. ఇలా ఐఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడే వారి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ప్రస్తుతం మన వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్టీఏ చలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవైసీ, కొరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లింపులు, వీడియో, ఫొటో షేరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట ఒక మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపుతున్నారు. దానితో పాటు ఒక ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లింకు చేస్తారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించే ప్రతి అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏపీకే ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగిలించి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో లింకులు పంపుతున్నారు. ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేసిన వెంటనే మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. దాంతో వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్తుంది. 

హ్యాక్ అయితే ఇలా ఫిర్యాదు చేయాలి 

మంత్రుల వాట్సాప్‌‌‌‌ గ్రూపుల్లోకి హ్యాకర్లు చొరబడ్డారని తెలియడంతో రాష్ట్ర సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో, సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీకే ఫైల్స్‌‌‌‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌‌‌‌ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఎన్‌‌‌‌సీఆర్​బీ పోర్టల్‌‌‌‌తో పాటు స్థానిక పోలీస్‌‌‌‌ స్టేషన్లలో ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్‌‌‌‌ హ్యాక్‌‌‌‌ అయితే వెంటనే ‌‌‌‌ www.whatsapp.com/contact లో  ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అలాగే సైబర్‌‌‌‌ క్రైం రిపోర్టింగ్‌‌‌‌ టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌ 1930కి కాల్‌‌‌‌ చేయాలని.. లేదంటే సైబర్‌‌‌‌ ఫ్రాడ్‌‌‌‌ రిజిస్ట్రీ కోసం 8712672222 నెంబర్ లో రిపోర్టు చేయాలని పేర్కొంటున్నారు. 

అనుమానం వస్తే ఇలా చేయాలి..  

సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(.apk) లింకులను ఎట్టి పరిస్థితిలోను క్లిక్ చేయొద్దు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టూ-స్టెప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల సీక్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ చేస్తే తప్ప వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్ కాదు. అనుమానం వస్తే వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. మళ్లీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, మీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెరిఫై చేసుకోవాలి. సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి. ఫోన్ ఓవర్ హీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే మొబైల్ హ్యాక్ అయినట్లు భావించాలి. గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే యాప్స్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. వీటిలోనూ కొన్ని స్కామర్లు సృష్టించినవి ఉంటాయి. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రం అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. దీంతో మన అనుమతి లేకుండా యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావు. ఏపీకే ఫైల్, మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగినట్లు అనుమానం వస్తే మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. ఆ వెంటనే బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పిన్ నంబర్లు, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చుకోవాలి.