70 నిమిషాల ఏకపాత్రాభినయం.. అలరించిన తెలంగాణ నాట్య అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య

70 నిమిషాల ఏకపాత్రాభినయం.. అలరించిన తెలంగాణ నాట్య అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య

తెలంగాణ నాట్య అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల మరోసారి తన నట నైపుణ్యాన్ని చాటుకున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమీ, సూత్రధార్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ఆమె దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. 70 నిమిషాలపాటు సాగిన నాన్‌‌స్టాప్ వాచకాభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.