
అసెంబ్లీలో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఆర్ ఎస్ నుంచి కేటీఆర్, కడియం శ్రీహరి,కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
డిసెంబర్ 10న 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతోఇప్పటి వరకు 109 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ ను అధికారికంగా ప్రకటించారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. స్పీకర్ కు సీఎంతో పాటు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.