
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణను వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని.. నేటి (ఆగస్ట్ 16, 2025) నుంచి మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Also read:-తెలంగాణలో వానలే వానలు.. ఏఏ జిల్లాల్లో తాజా పరిస్థితి ఎలా ఉందంటే..
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ( గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ) కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. రేపు (17-08-2025) కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.