పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి..పీఆర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు టీపీఎస్ఏ వినతి

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి..పీఆర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు టీపీఎస్ఏ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పని ఒత్తిడితో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె. అరుణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ దివ్య కు 12 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్పెషల్ ఆఫీసర్ల కాలంలో పనులు చేసి, రెండేండ్లుగా ఐఎఫ్ఎంఐఎస్ లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బిల్లుల చెక్కులను తక్షణమే క్లియర్ చేయాలని కోరారు. జేపీఎస్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ను 2019 నుంచే పరిగణించి, ప్రొబేషన్‌‌‌‌‌‌‌‌ను రెండేండ్లకు తగ్గించి 4 నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. నిర్దిష్ట పనివేళలు పాటించాలని, మహిళా కార్యదర్శులకు ఇబ్బందికరంగా మారిన రాత్రి వేళల సమీక్షలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. 1,039 మంది ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను జేపీఎస్‌‌‌‌‌‌‌‌లుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు.