మీఊర్లో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో తెలుసా?

మీఊర్లో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో తెలుసా?

ప్రత్యేక యాప్ రూపొందించిన టీఎస్ పీసీబీ

హైదరాబాద్, వెలుగు: తమ ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలు తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీఎస్‌ పీసీబీ) ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా మొబైల్ నుంచే కాలుష్య కారక పరిశ్రమలపై ఫిర్యాదు చేయొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీఎస్ఎయిర్(TSAIR)యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గాలిలో ఎన్ఓ2, పీఎం 10, పీఎం 2.5, ఓ3 ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ రోజూ సాయంత్రం విడుదలయ్యే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( ఏక్యూఐ) బులెటిన్ చూడొచ్చు. కాలుష్య కారక పరిశ్రమలు, ఇండస్ట్రియల్ వేస్ట్ డంపింగ్, రోడ్డు డస్ట్, బహిరంగంగా చెత్తను కాల్చడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త డంప్ చేయడం, పీసీబీ రూల్స్‌కు వ్యతిరేకంగా చేపట్టే భవన నిర్మాణాలు, కూల్చివేతలు, కాలుష్యం కలిగించే కంపెనీలు, వ్యక్తులపై కంప్లైంట్ చేయొచ్చు. ఫొటోలు, వీడియోలు కూడా అప్‌లోడ్ చేయొచ్చు. ఈ యాప్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం స్టార్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాస్పిటల్స్ లో బయో వేస్ట్ నిర్వహణను సక్రమంగా ఉందో లేదో తెలుసుకునేందుకు నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

For More News..

రాష్ట్రంలో మరో 2,579 కరోనా పాజిటివ్ కేసులు

ఒక్క తప్పు.. టోర్నీనే దెబ్బతీస్తుంది

వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు