ఫిబ్రవరి 28న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం

ఫిబ్రవరి 28న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
  • హాజరు కానున్న రాష్ట్ర ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ 

హైదరాబాద్, వెలుగు: పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 28న గాంధీ భవన్ లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. పార్టీ ఇన్ చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  మొదటిసారి ఈ మీటింగ్ కు హాజరుకానుండడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇందులో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు.