V6 News

పీజీ ఈసెట్ కు 11,347 దరఖాస్తులు...రూ.250 ఫైన్ తో మే 9 వరకు చాన్స్ : కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వర రావు

పీజీ ఈసెట్ కు 11,347 దరఖాస్తులు...రూ.250 ఫైన్ తో మే 9 వరకు చాన్స్ : కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వర రావు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పీజీ ఈసెట్2026 ప్రవేశ పరీక్షకు 11,347 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు వెల్లడించారు.  పీజీఈసెట్ ద్వారా రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 19 విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా విద్యార్థులు అత్యధికంగా ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలకే పోటీ పడుతున్నారు. ఎం.ఫార్మసీకి 4,579 దరఖాస్తులు రాగా, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 3,742 మంది అప్లై చేసుకున్నారు. 

ఆ తర్వాతి స్థానాల్లో ఈసీఈ 1,036, సివిల్ 697, ఎలక్ట్రికల్ 649 విభాగాలు ఉన్నాయి. టెక్స్‌‌‌‌టైల్ టెక్నాలజీకి కేవలం 3 దరఖాస్తులు వచ్చాయి. మెటలర్జికల్ ఇంజినీరింగ్‌‌‌‌కు 11, ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్‌‌‌‌కు 12 చొప్పున అప్లికేషన్లు వచ్చాయి. రూ.250 ఫైన్ తో మే 9 వరకు, రూ.500 ఫైన్ తో మే 12 వరకు, రూ.10వేలతో మే 26 వరకు అప్లై చేసుకోవచ్చని, వివరాలకు pgecet.tgche.ac.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ చూడాలని కన్వీనర్​ సూచించారు.