ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో  పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లగా ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
 ప్రభాకర్ రావు అమెరికాలో  ఇప్పటికే గుర్తించిన సిట్ బృందం శ్రవణరావు ఆచూకీని ఇంకా కనుక్కోలేదు. మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోగా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ALSO READ | ఎన్టీఆర్ ఒక బ్రాండ్.. దేశానికి సంకీర్ణ రాజకీయాలు నేర్పించారు : సీఎం రేవంత్ రెడ్డి