
రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ HICCలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సంకీర్ణ రాజకీయాలు ఎన్టీఆర్ నేర్పించారన్నారు. ఎంతో మందిని రాజకీయాలకు పరిచం చేసిన వ్యక్తని అన్నారు.
పది మందిని ఆదుకునే గుణం కమ్మవారిదని చెప్పారు. కమ్మల కష్టానికి గుర్తింపు అవకాశాలు ఉంటాయని చెప్పారు. మట్టి నుంచి బంగారం తీయగల శక్తి కమ్మవారికి ఉందన్నారు. ఎన్టీఆర్ రాజకీయాలకు ఒక బ్రాండ్ అని లీడర్ షిప్ కు ఒక కబ్రాండ్ అని అని అన్నారు.