హైదరాబాద్ లో భారీగా ఎస్ఐల బదిలీలు

హైదరాబాద్ లో భారీగా ఎస్ఐల బదిలీలు

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఇటీవల పెద్ద ఎత్తున డిఎస్పీల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఎస్ఐల బదిలీలు చేస్తూ ఈ రోజు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు ఉత్తర్వలు జారీ చేశాయి. మొత్తం 104 మంది సబ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ లో 63, సైబరాబాద్ కమిషనరేట్ లో 41 మంది ఇన్స్పెక్టర్లకు స్థాన చలనాలు జరిగాయి. 

సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ లో విధుల నిర్వహిస్తున్న సొమవరపు శ్రీనివాస్ చారి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు,  సెంట్రల్ క్రైం స్టేషన్ ఎస్ఐను  బహదూర్ పురా పీఎస్ కు ట్రాన్స్వర్ చేశారు. కేబీహెబ్ ఎస్ఐ ను రాయ్ దుర్గ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రస్తుత పీఎస్ ల నుంచి కొత్తగా పోస్టింగ్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో వీరు రిపోర్ట్ చేయాలి.