మెదక్టౌన్, వెలుగు: సీసీటీఎన్ఎస్, ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా పోలీసులకు బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ వి.వి. శ్రీనివాసరావు కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు అనిల్, అమర్నాథ్, టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు ప్రశంసా పత్రాలను స్వీకరించారు.
ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ఇలాంటి గుర్తింపులు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచుతాయన్నారు.
