పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసుల హ్యాట్రిక్

పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసుల హ్యాట్రిక్
  • నాగపూర్​లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్​లో ఓవర్ ఆల్ చాంపియన్ ట్రోఫీ కైవసం 
  •     సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి అభినందనలు 

హైదరాబాద్, వెలుగు: జాతీయస్థాయిలో రాష్ట్ర పోలీసులు మరోసారి సత్తా చాటారు. వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియ న్’ ట్రోఫీని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధిం చారు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌‌లో తెలంగాణ పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ఘనతపై సీఎం రేవంత్​ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర పోలీసులను అభినం దించారు. సీఐడీ పర్యవేక్షణలో నిరంతర శిక్ష ణతో రాష్ట్ర పోలీసులు ప్రతిభను చాటుకున్నారు.

2024లో ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నోలో, 2025లో ఝార్ఖండ్‌‌లోని రాంచీలో, ప్రస్తుతం నాగ్‌‌పూర్‌‌లోని అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌‌లో వరుసగా తెలంగాణ ఓవరాల్ ఛాంపి యన్‌‌గా నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌‌నెస్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫొటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌‌గా నిలిచారు. 

రాష్ట్ర పోలీస్ విభాగం సాధించిన ఈ ఘనత తెలంగాణ కీర్తికిరీటం లో మరో మైలురాయిగా నిలుస్తుందని, అధికారుల అంకితభావం, క్రమశిక్షణే ఈ విజయాని కి పునాదులని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసించారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల వృత్తి నైపు ణ్యానికి, సన్నద్ధతకు, క్షేత్రస్థాయిలో వారు కనబరుస్తున్న పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుం దన్నారు. కాగా, 6 బంగారు, 3 వెండి, 3 కాంస్య పతకాలు గెలుచుకున్న సందర్భంగా సీఐడీ అడిషనల్ డీజీపీ చారు సిన్హాను, ప్రధాన కోచ్​లు డి. ప్రతాప్( అదనపు ఎస్పీ టీజీ జెన్‌‌కో), ఎం. రామకృష్ణ (కమాండెంట్ 8వ బెటాలియన్),  టీమ్ మేనేజర్ కె. ప్రసాద్ (ఎస్పీ సీఐడీ) లను, విజేతలను డీజీపీ అభినందించారు.