యాలాలో.. యాలాలో.. డీజేల మోతలు మనకొద్దురో... వైరల్ అవుతోన్న తెలంగాణ పోలీసుల సాంగ్

యాలాలో.. యాలాలో.. డీజేల మోతలు మనకొద్దురో...  వైరల్ అవుతోన్న తెలంగాణ పోలీసుల సాంగ్

వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు, రాష్ట్రవ్యాప్తంగా డీజే మోతలు, హడావుడి మామూలుగా ఉండదు. అయితే, ఈ మితీమీరిన శబ్ద కాలుష్యం ఎన్నో అనారోగ్య సమస్యలకు, కొన్నిసార్లు ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతోంది. 

ఈ నేపథ్యంలో డీజేల దుష్ప్రభావాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరిచేందుకు తెలంగాణ పోలీసులు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.ఇరుముడి సినిమాలోని పాపులర్ ట్యూన్ స్టైల్‌లోయాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో అంటూ ఒక అద్భుతమైన అవగాహన గీతాన్ని రూపొందించారు. 

హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట సీఐ సురేష్ కుమార్ తీసుకున్న ఈ వినూత్న ఆలోచన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పండుగలను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని, డీజేలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్న ఈ పోలీసుల సాంగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు సూపర్ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.