జైళ్ల శాఖ సంపాదనలో తెలంగాణ ఖైదీలు దేశంలోనే ఫస్ట్

జైళ్ల శాఖ సంపాదనలో తెలంగాణ ఖైదీలు దేశంలోనే ఫస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఖైదీలు ఇటు శిక్షలు అనుభవిస్తూనే.. అటు పనులు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. జైళ్ల శాఖకు మంచి రెవెన్యూ తెచ్చిపెడుతున్నారు. శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌‌ బంక్​లు, హోటళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, జైల్‌‌ ఇండస్ట్రీ ద్వారా ఏటా భారీ రాబడి వస్తోంది. గతేడాది రూ. 599.98 కోట్లు టర్నోవర్‌‌‌‌ చేసి దేశంలోనే నంబర్‌‌‌‌ వన్‌‌ స్థానంలో మన జైళ్ల శాఖ నిలిచింది. ఇటీవల నేషనల్‌‌ క్రైమ్‌‌ రికార్డ్స్‌‌ బ్యూరో విడుదల చేసిన రిపోర్ట్​లో ఈ విషయం వెల్లడైంది. గత ఏడాది దేశవ్యాప్తంగా జైల్స్‌‌ ఉత్పత్తుల టర్నోవర్​ రూ. 846.04 కోట్లు. ఇందులో రూ. 599.98 కోట్లు ఒక్క మన రాష్ట్ర జైల్స్‌‌ డిపార్ట్‌‌మెంటే సంపాదించి ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. రూ. 72.96 కోట్లతో తమిళనాడు జైళ్ల శాఖ సెకండ్‌‌ ప్లేస్‌‌ దక్కించుకుంది. ఆ తరువాతి ప్లేస్​లలో మహారాష్ట్ర (రూ. 29.4 కోట్లు), కేరళ (రూ. 25.03 కోట్లు), ఢిల్లీ (రూ. 23 కోట్లు), బీహార్‌‌ (రూ. ‌‌22.09 కోట్లు), ఆంధ్రపదేశ్‌‌ (రూ. 15.62 కోట్లు) జైళ్ల శాఖలు నిలిచాయి.

రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌‌‌‌గూడ, చర్లపల్లి, వరంగల్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ జైళ్లతో పాటు జిల్లాల్లో పెంట్రోల్‌‌‌‌ బంక్స్‌‌‌‌ నడుస్తున్నాయి.19 పెట్రోల్ బంకుల్లో 430 మందికి పైగా పనిచేస్తున్నారు. పెట్రోల్‌‌‌‌ బంకుల ఔట్‌‌‌‌లెట్స్‌‌‌‌తో గతేడాది సుమారు రూ. 450 కోట్లు టర్నోవర్‌‌‌‌‌‌‌‌  జరిగింది. ఇందులో  రూ. 14 కోట్లు జైళ్ల శాఖకు రెవెన్యూ వచ్చింది. 2018లో  రూ. 495.86 కోట్ల టర్నోవర్ చేయగా.. జైళ్ల శాఖకు రూ. 17 కోట్ల రెవెన్యూ వచ్చింది. దీంతో పాటు మై నేషన్‌‌‌‌ పేరుతో నిర్వహిస్తున్న హోటళ్లు, ఆయుర్వేదిక్  విలేజ్‌‌‌‌, జైల్స్‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌ ఔట్‌‌‌‌లెట్స్‌‌‌‌లో  సుమారు 300 మంది పనిచేస్తున్నారు. వీరిలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలతోపాటు, విడుదలైన ఖైదీలు కూడా ఉన్నారు.

రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌‌‌‌గూడ,చర్లపల్లి, వరంగల్‌‌‌‌ సెం ట్రల్‌‌‌‌ జైళ్లతో పాటు జిల్లా ల్లో పెంట్రోల్‌‌‌‌ బంక్స్‌‌‌‌ నడుస్తున్నాయి.19 పెట్రోల్ బంకుల్లో 430 మందికి పైగా పని
చేస్తున్నారు. పెట్రోల్‌‌‌‌ బంకుల ఔట్‌‌‌‌లెట్స్‌‌‌‌తో గతేడాది సుమారు రూ. 450 కోట్లు టర్నోవర్‌‌‌‌‌‌‌‌ జరిగిం ది. ఇందులో రూ. 14 కోట్లు జైళ్లశాఖకు రెవెన్యూ వచ్చింది. 2018లో రూ.
495.86 కోట్ల టర్నోవర్ చేయగా.. జైళ్లశాఖకు రూ. 17 కోట్ల రెవెన్యూ వచ్చింది.దీంతో పాటు మై నేషన్‌ పేరుతో నిర్వహిస్తున్నహోటళ్లు, ఆయుర్వేదిక్ విలేజ్‌‌‌‌, జైల్స్‌‌‌‌ ప్రొడక్స్‌ట్ ఔట్‌‌‌‌లెట్స్‌‌‌‌లో సుమారు 300 మంది పనిచేస్తున్నారు. వీరిలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలతోపాటు, విడుదలైన ఖైదీలు కూడా ఉన్నారు