టీఎస్​పీఎస్సీ అధికారులపై చర్యలు తీసుకోవాలి

టీఎస్​పీఎస్సీ అధికారులపై చర్యలు తీసుకోవాలి

అంబర్​పేట, వెలుగు : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ) వెబ్​సైట్ హ్యాకింగ్​కు గురవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి జావేద్ మండిపడ్డారు. వెబ్​సైట్ హ్యాక్ కావడంపై అనేక అనుమనాలున్నాయని, టీఎస్​పీఎస్సీ అధికారులకు తెలియకుండా ప్రశ్నపత్రాలు లీక్ కావన్నారు. ఈ మేరకు జావేద్ ​ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హ్యాకింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ ​చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

పెద్దల హస్తం ఉంది

టీఎస్​పీఎస్సీ నిర్లక్ష్యంతోనే అత్యంత  కాన్ఫిడెన్షియల్​గా ఉంచాల్సిన సమాచారం లీక్ అయ్యిందని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. టీఎస్​పీఎస్సీ లీక్​చేసి దాన్ని కప్పి పుచ్చుకోవాలని హాకింగ్ అంటూ నాటకమాడుతోందని మండిపడ్డారు. లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్యంగా ఉండే సమాచారాన్ని ఒక సాధారణ ఉద్యోగి ఎట్లా లీక్ చేస్తాడని ప్రశ్నించారు.  దీని వెనక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.