రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

 రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.  వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  వాయవ్య బంగాళాఖాతంలో  ఈనెల 18న మరొక ఆవర్తన ద్రోణి ఏర్పడే చాన్స్ ఉందని ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు  ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయన్నారు అధికారులు. 

నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. భీంగల్ లో అత్యధికంగా 7 సెంటీ మీటర్ల వర్షం పాతం నమోదయ్యింది. ముప్కాల్ లో 3 సెంటీ మీటర్లు, కమ్మర్పల్లి, వేల్పూరులో 2 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రిలో జోరుగా వర్షం పడుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న వానలతో మూసీ ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి పెరిగింది.  645 అడుగులకుగాను 641 అడుగులమేర వరదనీరు చేరింది. అటు నాగార్జునసాగర్  లో 590 అడుగులకు ప్రస్తుతం 517 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 

ALSO READ :మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూరు, దోమకొండ, తాడ్వాయి, సదాశివనగర్, బీబీపేట్, మాచారెడ్డి మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షంపు నీరు రోడ్లపై చేరడంతో ఇబ్బందిపడుతున్నారు ప్రయాణీకులు. బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ కాలనీల్లో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుండడంతో నానా అవస్థలు పడుతున్నారు స్థానికులు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. వర్షాల కురుస్తుండంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.  

ఉత్తరాదిన వర్ష బీభత్సం

ఉత్తరాదిలో వరద బీభత్సం కొనసాగుతోది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలో యమునా నదికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. హరిద్వార్ లో గంగానది లో భారీగా వరద నీరు చేరడంతో 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది.భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇటు ఈశాన్య రాష్ట్రాలను కూడా వదరలు ముంచెత్తాయి. అసోంలో వేల ఇండ్లు నీట మునిగాయి. బ్రహ్మపుత్రా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.