రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలి చింది. రాష్ట్రవ్యాప్తంగా 2022లో178 మంది రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ రాష్ట్రాలు మొ దటి మూడు స్థానాల్లో ఉండగా ఆ తరువాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఆత్మహత్యలు, వివిధ రంగాల ప్రజల సూసైడ్స్ కు సంబంధించిన లెక్కలను ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌‌‌‌బ్యూరో(ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ) సోమవారం తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవారీగా వివరాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం 2022లో మహారాష్ట్రలో అత్యధికంగా 2,448 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఆ తర్వాత కర్నాటకలో 985 మంది, ఏపీలో 309 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణ తర్వాత 136 రైతు ఆత్మహత్యలతో పంజాబ్ ఐదో స్థానంలో నిలిచింది. 

అగ్రి సెక్టార్​లో 11,290 మంది..  

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పోయిన ఏడాది మొత్తం 11,290 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 5,207 మంది రైతులు ఉన్నారు. వీరిలో 4,999 మంది పురుషులు, 208 మంది మహిళలు ఉన్నారు. అలాగే 6,083 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 611 మంది మహిళలు, 5,472 మంది పురుషులు ఉన్నారు.  

ఓవరాల్ సూసైడ్స్​లో 6వ స్థానం 

దేశవ్యాప్తంగా గతేడాది ఆత్మహత్యలు 4.2 శాతం పెరిగాయి. నిరుద్యోగం, కుటుంబ కలహాలు, పరీక్షల్లో ఫెయిల్‌‌‌‌, ఉపాధి లేమి, ప్రేమవ్యవహారాలు, వృత్తిపరమైన సమస్యలు, ఆస్తి తగాదాలు, ఆరోగ్య సమస్యలు, తదితర కారణాల వల్ల 2021లో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకోగా 2022లో మొత్తం 1,70,924 మంది బలన్మరణానికి పాల్పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీతో పోల్చితే తెంగాణలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. ఏపీలో 8,908 సూసైడ్స్ నమోదు కాగా, తెలంగాణలో 9,980 సూసైడ్స్ రికార్డ్ అయ్యాయి. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జనాభాలతో పోల్చితే సగటున 26.3 శాతంతో ఓవరాల్ సూసైడ్స్ లో తెలంగాణ 6వ స్థానంలో నిలించింది. రాష్ట్రంలో 4,513 మంది రోజువారి కూలీలు, 24 మంది రిటైర్డ్ ఉద్యోగులు,133 మంది నిరుద్యోగులు, 2,272 మంది స్వయం ఉపాధితో జీవిస్తున్నవారు, స్టూడెంట్స్‌‌‌‌ సహా వివిధ రంగాలకు చెందినవారు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 22,746 ఆత్మహత్యలు జరిగాయి. ఆ తర్వాత తమిళనాడులో 19,834, మధ్యప్రదేశ్‌‌‌‌లో 15,386, కర్నాటకలో13,606, వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌లో 12,669 మంది, కేరళలో 10,162 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.