మిల్లర్ల బంద్ విరమణ..మంత్రి ఉత్తమ్ హామీతో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్ణయం

మిల్లర్ల బంద్ విరమణ..మంత్రి ఉత్తమ్ హామీతో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  మిల్లర్ల సమస్యల పరిష్కారానికి సివిల్​సప్లయ్స్​శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో మిల్లుల బంద్​ను విరమిస్తున్నట్లు రారైస్ మిల్లర్స్ అసోసియేషన్​ప్రకటించింది. మిల్లర్ల డిమాండ్ల కాపీపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌‌ను మంత్రి లిఖితపూర్వకంగా ఆదేశించారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి వెల్లడించారు. మంత్రి హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు