గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సోషల్‌‌‌‌ మీడియాకు నెలకు రూ.60 వేలు కావాలట

 గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సోషల్‌‌‌‌ మీడియాకు నెలకు రూ.60 వేలు కావాలట
  • రెండు రాష్ట్రాలకు జీఆర్‌‌‌‌ఎంబీ ప్రతిపాదన 
  • ఆర్థిక భారం తప్ప లాభం లేదని తిరస్కరించిన తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ).. కొత్తగా సోషల్ మీడియాని వినియోగిస్తుందట. అందుకు ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్, ఎగ్జిక్యూటివ్ ని నియమించుకోవాలని భావిస్తున్నది. దానికో రూ.60 వేలు కావాలట. ఇదే ప్రతిపాదనని 2 రాష్ట్రాల ముందు పెట్టగా.. మన ప్రభుత్వం తిరస్కరించింది. 

ఈ మేరకు ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. అవసరానికి అనుగుణంగా శాఖల పరిధిలోని పనులరీత్యా సోషల్‌‌‌‌మీడియా హ్యాండిల్‌‌‌‌ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలని కేంద్ర జలశక్తిశాఖ తన పరిధిలోని అన్ని డిపార్ట్​మెంట్లకు ఇటీవల సూచనలు జారీ చేసింది. 

ఇదే విషయాన్ని వివరిస్తూ సోషల్‌‌‌‌ మీడియా హ్యాండిల్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు తెలిపింది. బోర్డుకు సోషల్‌‌‌‌ మీడియా హ్యాండ్లర్‌‌‌‌ అవసరమేమీ లేదని తెలంగాణ తేల్చిచెప్పింది.  అదనపు ఖర్చే తప్ప దాని వల్ల లాభమేమీ లేదని స్పష్టం చేసింది.