స్టాఫ్ నర్స్ ఇక నర్సింగ్ ఆఫీసర్‌‌..హోదాను మారుస్తూ సర్కార్ జీవో

స్టాఫ్ నర్స్ ఇక నర్సింగ్ ఆఫీసర్‌‌..హోదాను మారుస్తూ సర్కార్ జీవో
  • రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం: హరీశ్​రావు
  • హోదాను మారుస్తూ సర్కార్ జీవో

హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ డిజిగ్నేషన్‌‌‌‌ను స్టాఫ్ నర్స్ నుంచి నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా మార్చాలన్న నర్సుల డిమాండ్‌‌‌‌ను నెరవేర్చింది. స్టాఫ్ నర్స్ హోదాను నర్సింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిం ది. వైద్య ఆరోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి మంత్రి హరీశ్‌‌‌‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. మీ గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది” అని ట్వీట్‌‌‌‌ చేశారు.

రాష్ట్రంలో వైద్య విద్యలో విప్లవం: హరీశ్

రాష్ట్రంలో ఇకపై స్టాఫ్ నర్స్ అని పిలవొద్దని, నర్సింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పిలవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో వెయ్యి పడకల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్‌‌‌‌ను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ వైద్య విద్యా రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాన్ని తీసుకొచ్చారని, ఆయన హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పారు. గతంలో సంపన్నుల పిల్లలే వైద్య విద్య చదివే వాళ్లని, కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో  పేదలు, రైతులు, కూలీలు, కార్మికుల పిల్లలు కూడా డాక్టర్లు కాగలుగుతున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు కూడా తెలంగాణకు వచ్చి ఎంబీబీఎస్​చదువుతున్నారంటే వైద్య విద్యా రంగంలో ఎంత అభివృద్ధి జరిగిందో అర్థమవుతున్నదన్నారు. సిద్దిపేట వెయ్యి పడకల ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందనుందని తెలిపారు.