భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు కేసులు అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958కి చేరుకుంది. మరో 32 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 5,24,941కు చేరుకుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే... మంగళవారం 434 కేసులు నమోదయితే.. గత 24 గంటల్లో 494 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 126 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 90, 473 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.10 శాతంగా ఉందని, మొత్తం 28 వేల 865 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు : -
ఆదిలాబాద్ 03, భద్రాద్రి కొత్తగూడెం 03, హైదరాబాద్ 315, జగిత్యాల 00, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 02, కరీంనగర్ 02, ఖమ్మం 05, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 00, మహబూబాబాద్ 00, మంచిర్యాల 00, మెదక్ 03, మేడ్చల్ మల్కాజ్ గిరి 31, ములుగు 00, నాగర్ కర్నూలు 00, నల్గొండ 02, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 02, పెద్దపల్లి 01, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 102, సంగారెడ్డి 11, సిద్ధిపేట 02, సూర్యాపేట 04, వికారాబాద్ 00, వనపర్తి 00, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 03, యాదాద్రి భువనగరి 03. మొత్తం - 494
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) June 23, 2022
(Dated.23.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Q7RSIp9Iol
