హుజురాబాద్ వెలుగు: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ గోసికొండ శ్రీరాములుకు పోచంపల్లి ఇక్కత్, బెనారస్ చీరలు ఉత్పత్తయ్యే చేనేత ప్రాంతాల్లో పరిశోధన చేయడానికి ఎంపికయ్యారు.
కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి(ఐసీఎస్‌ఎస్‌ఆర్) న్యూఢిల్లీ వారు ‘దేశంలోని నేత సముదాయాలు: భౌగోళిక గుర్తింపు, నేత కార్మికుల సామాజిక-ఆర్థిక, రాజకీయ స్థితిగతులు’ అనే అంశంపై నలుగురు పరిశోధకులతో కూడిన బృందానికి రూ.పది లక్షల గ్రాంటును విడుదల చేసింది. ఈ పరిశోధనలో శ్రీరాములు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.
