RTC డ్రైవర్లకు ‘హార్ట్​ఎటాక్’: ఒత్తిడిలో డ్రైవింగ్

RTC డ్రైవర్లకు ‘హార్ట్​ఎటాక్’: ఒత్తిడిలో డ్రైవింగ్
  • గుండె జబ్బుల బారిన పలువురు ఆర్టీసీ డ్రైవర్లు
  • తీవ్రమైన ఒత్తిడిలోనే డ్రైవింగ్
  • పనిభారం, అధికారుల వేధింపులతో మానసిక ఆందోళన
  • కొత్త డ్రైవర్ల నియమాకం చేపట్టాలంటున్న కార్మిక సంఘాలు

విరామం లేదు.. విశ్రాంతి లేదు.. ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు.. డబుల్ డ్యూటీలు, సెలవులు రద్దు ఇలా అనేక సమస్యల నడుమ డ్రైవర్లు ‘ఆర్టీసీ’ బస్సును నడిపిస్తున్నారు. హార్ట్​ఎటాక్ ల బారిన పడుతున్నారు. షుగర్లు, బీపీలు తెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్ తో సంబంధం లేకుండా 3నిమిషాలకు కిలోమీటరు వెళ్లాల్సిందే. ఒక వేళ ఆన్ డ్యూటీలో చనిపోతే ఎంప్లాయీ కుటుంబానికి అందుతుందీ అంతంత మాత్రమే..

గ్రేటర్ పరిధి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారంపెరుగుతోంది . సరిపడినంత విశ్రాంతి లేకపోవటం, డబుల్ డ్యూటీలు, సెలవులు లేకపోవటం కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇది కాస్తవారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది .ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు హార్ట్ఎటాక్ బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజుల క్రితమే బాలేష్ అనే కండక్టర్ జేబీఎస్ లో నిద్రిస్తుండగా గుండె పోటుతో మృతిచెందాడు. పని ఒత్తిడి కారణంగానే మృతిచెందాడని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఈ ఒక్క సంఘటనే కాదు నెలన్నర క్రితం మల్లారెడ్డి అనే డ్రైవర్ గుండె పోటుతో చనిపోయాడు.

చందానగర్ లో బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే తరచూ ఆర్టీసీ డ్రైవర్లు గుండెపోటుకు గురవటం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపులు, ఒత్తిడినే ప్రధాన కారణమని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 3నిమిషాలకు కిలోమీటర్ ప్రయాణం చేయాలన్ననిబంధన ఉంది . ఇక్కడి ట్రాఫిక్ లో 3 నిమిషాలకు కిలోమీటర్ ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా అధికారులు పట్టించుకోవటం లేదు. పైగా డ్యూటీసమయం పది గంటలకు పైగా ఉంటోంది . దీంతో ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆన్ డ్యూటీలో డ్రైవర్లు చనిపోయినప్పటికీ వారి కుటుంబాలకు కేవలం రూ.20 వేల మాత్రమే ఇచ్చిచేతులు దులుపుకుంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవర్ల కొరతతీవ్రంగా ఉంది. 9 ఏళ్లుగా ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఎలాంటి రిక్రూట్ మెంట్ జరగటం లేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి గ్రేటర్ పరిధిలో 800 వరకు డ్రైవర్ల కొరత ఉంది. దీనికి తోడు ఏటా రిటైర్ అవుతున్న ఆర్టీసీ డ్రైవర్ల స్థానంలో కొత్తవాళ్లను నియమించటం లేదు. ఉన్న వారిపైనే పనిభారం పెరుగుతోంది. డబుల్ డ్యూటీలు, సెలవులు లేకపోవటంతో చాలా మంది డ్రైవర్లు గతంలో తమ నిరసనలు తెలిపారు. కొత్త నియమాకాలు చేపట్టాలని కోరినప్పటికీ ఆర్టీసీ అధికారులు పట్టించు కోవటం లేదు. గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న జనాభా కారణంగా ఉన్న బస్సుల ద్వారానే ట్రిప్పులను పెంచుతున్నారు. పైగా అధికారుల వేధింపులు ఉంటున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. పదేళ్లుగా గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగటం లేదు. కోటికిపైగా జానాభా ఉన్న గ్రేటర్ పరిధిలో 60 శాతం మంది ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. కానీగ్రేటర్ లో ఉన్న బస్సుల సంఖ్య 3,800 మాత్రమే. ఇవి సరిపోవటం లేదు.

పెరుగుతున్న
ప్రమాదాలు
ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఇటీవల కాలంలో పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదలునుంచి గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలకారణంగా దాదాపు పది మంది కి పైగా చనిపో-యారు. గతేడాదిగ్రేటర్ పరిధిలో 146 ప్రమా-దాలు జరగగా 35 మంది మృతి చెందారు. ఈప్రమాదాలకు కారణం డ్రైవర్లపై ఉన్న ఒత్తిడేననికార్మిక సంఘాల నేతలు చెబుతున్నా రు. కండి షన్లో లేని బస్సులు, డబుల్ డ్యూటీలు, నిమిషానికిమూడు కిలోమీటర్ల టార్గెట్ కారణంగా ఆర్టీసీడ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నా రని చెబుతున్నా రు.ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని బస్సుల్లో సగానికి పైగాకాలం చెల్లి న బస్సులే ఉన్నా యి.చాలా మంది ఆర్టీసీ సిబ్బంది కిడ్నీ, కంటి, ఊపి-రితిత్తులు, లివర్ సమస్యలతో నిత్యం హాస్పి టళ్లచుట్టూ తిరుగుతున్నా రు. విశ్రాంతి లేకపోవటం-,సమయానికి తిండి తినకపోవటంతో నే జబ్బు లబారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.


కొత్తవారిని రిక్రూట్ చేయాలి

ఆర్టీసీ డ్రైవర్లు , కండక్టర్లపై విపరీతమైన ఒత్తిడి ఉంది. కొన్నేళ్లు గా ఆర్టీసీలోని ఏ విభాగాల్లోనూ నియమాకాలు లేవు. పైగా గ్రేటర్ పరిధిలో దాదాపు చాలా మంది రిటైర్ అయ్యారు. వారి స్థా నంలో ఖాళీలు భర్తీ చేయటం లేదు. దీంతో ఉన్న వారిపై పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారు . డ్రైవర్లు , కండక్టర్లపై అధికారులు వేధిం పులకు పాల్పడుతున్నారు . డ్రైవర్లపై ఒత్తిడి తగ్గాలంటే ముందు కొత్తవారిని రిక్రూట్ చేయాలి. కాలం చెల్లిన బస్సులను మార్చాల్సి ఉంది. డ్రైవర్లకు కిలోమీటర్ల పేరుతో పెట్టిన టార్గెట్లను తొలగించాలి.
అప్పుడే డ్రైవర్లపై ఒత్తిడి తగ్గుతుంది.
– హన్మంతు ముదిరాజ్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్