ఆదాయం పెంపుపై ఆర్టీసీ ఫోకస్..

ఆదాయం పెంపుపై ఆర్టీసీ ఫోకస్..
  • రాష్ట్రవ్యాప్తంగా 700 కమర్షియల్ రూంలు ..అద్దెకు ఇవ్వాలని నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 700 కమర్షియల్ రూంలను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలవనుంది. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల పరిధిలో ఈ గదులు ఉన్నాయి. వ్యాపారం చేయాలనుకునే వారు ఆర్టీసీ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ tgsrtc.telangana.gov.inను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఏ ప్రాంతంలో గదులు అందుబాటులో ఉన్నాయి, అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత, లీజు కాలం ఎంత అనే వివరాలన్నీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో ఎలాంటి మధ్యవర్తులు, ఫైరవీలకు అవకాశం లేకుండా గదులు కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని, మరోవైపు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి తక్కువ అద్దెలో మంచి అవకాశం దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు.