కార్మికుల హక్కులను పరిరక్షించడమే మా లక్ష్యం..ఉద్యోగ, కార్మికుల సమస్యలు 90 శాతం పరిష్కరించాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్మికుల హక్కులను పరిరక్షించడమే మా లక్ష్యం..ఉద్యోగ, కార్మికుల సమస్యలు 90 శాతం పరిష్కరించాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     జలమండలి ఎన్నికల్లో గెలుపొందిన మొగుళ్ల రాజిరెడ్డికి అభినందన 

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, గౌరవాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇటీవల జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా గెలుపొందిన ఐఎన్‌‌‌‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మంత్రి వివేక్‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాజిరెడ్డిని మంత్రి అభినందించి, సత్కరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కార్మికుల కోసం ప్రత్యేక విధానాలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కనీస వేతనాలను పెంచడం, గిగ్, ప్లాట్‌‌‌‌ఫామ్ కార్మికుల కోసం రక్షణ బిల్లును ఆమోదించిందని గుర్తుచేశారు. పెండింగ్‌‌‌‌లోఉన్న జలమండలి ఉద్యోగ, కార్మికుల సమస్యలు 90 శాతం వరకు పరిష్కరించామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్‌‌‌‌ను గెలిపించిన జలమండలి ఉద్యోగ, కార్మికులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 

మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, జలమండలి ఉద్యోగ, కార్మికులకు త్వరలో హెల్త్ కార్డులు ఇప్పించేందుకు, కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌‌‌‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌‌‌‌‌‌‌‌డీ చంద్రశేఖర్, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి టీపీ రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవణ్‌‌‌‌ కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్ అక్తర్ అలీ, నేతలు సి.రాజు, సీహెచ్ ప్రవీణ్ కుమార్, మజారుద్దీన్, తిరుపతి, బి.మహేశ్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.