వచ్చే నెలలో న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ

వచ్చే నెలలో న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ

న్యూఢిల్లీ: ప్యాకేజింగ్ సొల్యూషన్స్ సంస్థ న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ వచ్చే నెల 1‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–3 తేదీల్లో ఉంటుంది.  ఇష్యూ సైజు దాదాపు రూ.440 కోట్లు కాగా, షేరు ధరలను రూ.161–-170 గా నిర్ణయించారు. గరిష్ట ధర వద్ద కంపెనీ విలువ 2,080 కోట్లు సేకరిస్తుంది.

యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఈనెల 30 న ఉంటుంది. ఇందులో రూ.380 కోట్ల  విలువైన కొత్త ఈక్విటీ షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.59.5 కోట్ల  విలువైన 35 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయం ఉన్నాయి.  వచ్చే నెల ఎనిమిదో తేదీన షేర్లు లిస్ట్ అవుతాయి.