హాస్పిటాలిటీ రంగంలో భారీ అవకాశాలు: ఓయూ వైస్ చాన్స్లర్ కుమార్

హాస్పిటాలిటీ రంగంలో భారీ అవకాశాలు: ఓయూ వైస్ చాన్స్లర్ కుమార్

హైదరాబాద్​, వెలుగు: హోటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, కలినరీ ఆర్ట్స్ కోర్సులతో భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు.

తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్,  తెలంగాణ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ ఆఫ్ కలినరీ అండ్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ఓయూ తన హాస్పిటాలిటీ సిలబస్​ను నిరంతరం మార్చుతోందని చెప్పారు. ఈ కోర్సుల్లో ఏఐ , డిజిటల్ హాస్పిటాలిటీ వ్యవస్థలను చేర్చామన్నారు.