చర్చలకు పిలిస్తే ఓకే.. లేదంటే సమ్మె .. అత్యవసర సమావేశంలోఆర్టీసీ జేఏసీ నిర్ణయం

చర్చలకు పిలిస్తే ఓకే.. లేదంటే సమ్మె .. అత్యవసర సమావేశంలోఆర్టీసీ జేఏసీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే తాము వెళ్లేందుకు సిద్ధమని, లేదంటే ఈ నెల 7న సమ్మె తప్పదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ సంస్థ ప్రభుత్వానికి దీనిపై నోటీసు ఇచ్చింది. శనివారం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చిన ఏడు కార్మిక సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా వారు పలు అంశాలపై  చర్చించారు. ఆరో తేదీ లోపు ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని లేదంటే యథావిధిగా ఏడో తేదీ మొదటి షిఫ్టు నుంచే సమ్మెకు దిగుతామని ఈ సమావేశంలో నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే తమను వెంటనే చర్చలకు పిలిచి, ప్రధాన సమస్యల పరిష్కారం పై స్పష్టమైన హామీ ఇస్తే.. సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు.