టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం సడక్ బంద్

టీఎస్పీఎస్సీ  ప్రక్షాళన కోసం సడక్ బంద్
  •  జాబితా విడుదల చేసిన విపక్షాల కమిటీ
  • సర్కారుపై నిరుద్యోగుల అసంతృప్తిని తెలపడమే లక్ష్యం
  • ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాస్తారోకో
  • కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనాలని రేవంత్ పిలుపు

రాస్తారోకో పాయింట్స్

1. మహబూబ్ నగర్– హైదరాబాద్ (మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్)
2. వరంగల్–-హైదరాబాద్ ( వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘట్ కేసర్)
3. రామగుండం–-హైదరాబాద్ ( పెద్దపల్లి,కరీం నగర్, సిద్దిపేట, గజ్వేల్, శామీర్ పేట, తూం కుంట)
4. ఖమ్మం–-హైదరాబాద్ (ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్)

హైదరాబాద్: టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో రేపు విపక్షాల ఆధ్వర్యంలో సడక్ బంద్ జరగనుంది. ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా టీఎస్పీఎస్సీ సభ్యులను తొలగించి , నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరుతున్నాయి. డీఎస్సీ పోస్టులను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 పోస్టులకు పెంచాలని, పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో ఈ సడక్ బంద్ జరగనుంది. 

ఇటీవల బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలోఈ నిర్ణయాలు జరిగాయి. సమావేశానికి తెలంగాణ జనసమితి, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, పీడీఎస్ యూ, ఎస్​ఎఫ్​ఐ పాల్గొన్నాయి. నిరుద్యోగల పక్షాలన జరిగే ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు