మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు.. డిసెంబర్ నెలలో.. ఈ మూడు తేదీల్లో పోలింగ్

మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు.. డిసెంబర్ నెలలో.. ఈ మూడు తేదీల్లో పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 12 వేల 728 గ్రామ పంచాయతీలకు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. డిసెంబర్ 11న మొదటి దశ, డిసెంబర్ 14న రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్, రెండు గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని వెల్లడించారు.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
* 12 వేల 728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
* డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్
* డిసెంబర్ 14న రెండో దశ పోలింగ్
* డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు
* పంచాయతీల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలు
* నవంబర్ 27 నుంచి మొదటి దశ నామినేషన్లు
* నవంబర్ 30 నుంచి రెండో దశ నామినేషన్లు
* డిసెంబర్ 3 నుంచి మూడో దశ నామినేషన్లు
* పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
* పోలింగ్ ముగిసిన రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్