ఇండెంట్ వేయకుంటే.. బడుల్లో నో బ్రేక్ఫాస్ట్..హెడ్మాస్టర్లకు విద్యాశాఖ వార్నింగ్

ఇండెంట్ వేయకుంటే.. బడుల్లో నో బ్రేక్ఫాస్ట్..హెడ్మాస్టర్లకు విద్యాశాఖ వార్నింగ్
  •     మధ్యాహ్నం 2 గంటల్లోపే యాప్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాల్సిందే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అమలవుతున్న బ్రేక్ ఫాస్ట్ విత్ మిల్క్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో హెడ్మాస్టర్ల నిర్లక్ష్యంపై విద్యాశాఖ సీరియస్‌‌‌‌‌‌‌‌ అయింది. మరుసటి రోజు విద్యార్థులకు కావాల్సిన అల్పాహారం వివరాలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల లోపే ఎండీఎం యాప్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఇండెంట్ పంపకపోతే లేదా జీరోగా నమోదైతే .. ఆయా బడులకు బ్రేక్ ఫాస్ట్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. దీనికి సంబంధిత హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలే బాధ్యత వహించాలని డీఈఓలకు ఉత్తర్వులు జారీచేశారు. 

హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలు బాధ్యతగా వ్యవహరించాలి

రాష్ట్రవ్యాప్తంగా 3,700 బడుల్లో ఈ బ్రేక్​ఫాస్ట్ స్కీమ్ అమలవుతుండగా, 3.60 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందుతోంది. ఈ స్కీంను  నవంబర్ నాటికి రాష్ట్రంలోని అన్నిస్కూళ్లలో అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ అమలులో ముందు రోజే ఇండెండ్ పంపించాల్సి ఉంటుంది. హెడ్మాస్టర్లు, టీచర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 12 గంటల గడువును 2 గంటల వరకు పొడిగించినా.. చాలామంది హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలు ఇప్పటికీ ఇండెంట్ నమోదు చేయడం లేదు. పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో హెడ్​మాస్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మరుసటి రోజుకు ముందస్తు ఇండెంట్ రాకపోవడంతో సరఫరా ఏజెన్సీలకు వంట తయారీ, పంపిణీ ప్లానింగ్ కష్టతరంగా మారుతోందని, ఇలాంటి అలసత్వాన్ని ఏమాత్రం సహించమని ఆఫీసర్లను హెచ్చరించారు.