కొండచరియలు విరిగిపడి తెలంగాణ జవాను మృతి

కొండచరియలు విరిగిపడి తెలంగాణ జవాను మృతి

లడఖ్​లో కొండచరియలు విరిగిపడి మన జవాను మృతి

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాగజ్​నగర్​కు చెందిన షాకీర్ హుస్సేన్ దుర్మరణం

కాగజ్​నగర్, వెలుగు: దేశ రక్షణ కోసం -చైనా సరిహద్దుల్లో పహారా కాసిండు. ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉండే లడఖ్​లో డ్యూటీ చేసిండు. కానీ డ్యూటీ ముగించుకొని వెళ్తుండగా మృత్యువు వెంటాడింది. కొండచరియలు విరిగిపడి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​కు చెందిన షేక్ షాకీర్ హుస్సేన్​(38) మృతి చెందారు. శనివారం ఉదయం జరిగిందీ ఘటన. కాగజ్​నగర్​లోని రిక్షా కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ -జమ్సిద్ సుల్తానాలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద వాడైన షేక్ షాకీర్ హుస్సేన్ 2001 మార్చి 19న ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు. 2007లో పట్టణానికే చెందిన ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 2016లో షాకీర్ తన15 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. దేశ రక్షణ కోసం మరో ఐదేండ్లు సర్వీసును పొడిగించుకునిని లడఖ్​లో డ్యూటీ చేస్తున్నారు. రెండు నెలల కిందట ఇంటికి వచ్చి వెళ్లారు. శుక్రవారం రాత్రి తన భార్య, కుటుంబీకులతో షాకీర్ చివరి సారిగా మాట్లాడారు. శనివారం ఉదయం డ్యూటీ ముగించుకొని తోటి జవాన్లతో కలిసి క్యాంపునకు తిరిగి వెళ్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో షాకీర్ తీవ్రంగా గాయపడ్డారు. 10.30 సమయంలో షాకీర్ పని చేస్తున్న సెక్టార్ ఆఫీస్ అధికారుల నుంచి ఆయన ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది. యాక్సిడెంట్ అయిందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. 12 గంటలకు ఆయన చనిపోయినట్లు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో షాకీర్ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  షాకీర్‌‌‌‌ మరణవార్త తెలుసుకున్న స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు జవాన్​ ఇంటికి వచ్చి ఆయన కుటుంబసభ్యలను ఓదార్చారు.

For More News..

నేటి నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

దసరాకు సగం ‘ధరణి’ సిద్ధం

స్టూడెంట్స్‌‌ టెన్షన్ పడొద్దు కొత్త సర్టిఫికెట్లు ఇస్తం