ఎస్టీ గురుకులాల్లో ‘స్ఫూర్తి’..‘బడిని వదలద్దు – భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను కోల్పోవద్దు’ నినాదంతో ప్రచారం

ఎస్టీ గురుకులాల్లో ‘స్ఫూర్తి’..‘బడిని వదలద్దు – భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను కోల్పోవద్దు’ నినాదంతో ప్రచారం

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు బడికి దూరం కాకుండా, విద్యను కొనసాగించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ఎస్టీ గురుకుల సొసైటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బడిని వదలద్దు– భవిష్యత్‌‌‌‌ను కోల్పోవద్దు’ నినాదంతో ‘స్ఫూర్తి’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి వారం కౌన్సిలర్లు, క్లినికల్ సైకాలజిస్టులు, మోటివేషనల్ స్పీకర్లు, ఇతర నిపుణులతో స్టూడెంట్స్‌‌‌‌కు కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించనున్నారు. 

ఈ సెషన్లలో నిపుణులు విద్యార్థులతో నేరుగా మమేకమై, విద్య ప్రాధాన్యత, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడం, విద్యను కొనసాగించడం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, పాజిటివ్ ఆలోచనా విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. గురుకులాల్లో విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి వెల్లడించారు.