హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. 5 రోజుల క్రితం చనిపోయిన పీసీసీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సింధూ శంకర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రాత్రి 8 గంటలకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు కూతురు, మహారాష్ట్ర ఎమ్మెల్యే కైలాశ్ గోరంట్యాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.
రేపు ఉదయం (ఈనెల 15న) పార్టీ ఎస్టీ విభాగం చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్లతో భేటీ అవుతారని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం పార్టీ వైస్ ప్రెసిడెంట్లతో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రపై రివ్యూ చేస్తారని వెల్లడించింది. సాయంత్రం కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో భేటీ అయ్యి.. గురువారం నాగ్ పూర్ వెళ్లనున్నారు.
