బుద్వేల్ భూముల వేలం..సర్కార్ టార్గెట్ 4 వేల కోట్లు

బుద్వేల్ భూముల వేలం..సర్కార్ టార్గెట్ 4 వేల కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లోని బుద్వేల్ లో ఇవాళ ప్రభుత్వ భూముల వేలం వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. 100 ఎకరాల్లోని 14 ల్యాండ్ పార్సిళ్లలో రెండు సెషన్ లల్లో వేలం వేయనుంది. 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల విస్తీర్ణంతో వేలం నిర్వహించే ప్లాట్స్ ఉన్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 1 నుంచి 10 ప్లాట్లను వేయలం వేయనున్నారు అధికారులు. మధ్యాహ్నం 3  నుంచి 6 గంటల వరకు 11  నుంచి 17 వరకు ఉన్న ప్లాట్లను వేయలం వేయనున్నారు. 

ఎకరానికి 20 కోట్లుగా నిర్ణయింది రాష్ట్ర సర్కార్. ఈ భూముల వేలంతో సర్కార్ కు భారీగా ఆదాయం సమకూరనుంది. కాని ప్రభుత్వ టార్గెట్ మాత్రం 3 వేల నుంచి 4 వేల కోట్ల వరకు ఉంది. బుద్వేల్ ల్యాండ్ కు సంబంధించి ఈనెల 4న నోటిఫికేషన్ ఇచ్చింది హెచ్ఎండీఏ. అంటే కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఈ భూముల్ని అమ్మకానికి పెట్టింది సర్కార్. అయితే కోకాపేట భూములు వేలంలో పాల్గొన్న  బిడ్డర్ లే బుద్వేల్ వేలంపాటలో పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు.  ORR,  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేకు సమీపంలోనే బుద్వేల్, కోకాపేట ప్రాంతాలు ఉండటం కలిసి వస్తోందని అంటున్నారు ప్రభుత్వ అధికారులు..