యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న హెల్త్ డైరెక్టర్

యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న హెల్త్ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీనివాసరావుకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా తగ్గిపోయిందని హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస‌‌‌రావు ఇటీవలే కామెంట్స్ చేశారు. రెండున్నరేండ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా నుంచి మనం పూర్తిగా విముక్తి పొందామంటే కారణం మనం చేసిన సేవలు కాదని, ఏసుక్రీస్తు ప్రభావం వల్లేనని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు మాట్లాడారు. అన్ని మతాలు చెబుతున్నట్లు మంచిని ముందుకు తీసుకుపోవడం వల్ల మానవ జాతిని కాపాడుకున్నామన్నారు. ప్రపంచంలో మనదేశం మనుగడకు, అభివృద్ధికి క్రైస్తవమే కారణమన్నారు. క్రైస్తవం ఆనాడు ఆధునిక వైద్యం, విద్య, సంస్కృతిని తీసుకురావడం వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో ముందున్నదని పేర్కొన్నారు.