బత్తాయి తోటలను తొలగించొద్దు.. సిట్రస్ సాగుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తాం..

బత్తాయి తోటలను తొలగించొద్దు.. సిట్రస్ సాగుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తాం..
  • రైతులను ఆదుకుంటాం, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహకారం అందిస్తాం :
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • ఆధునిక సాగు పద్ధతులు పాటించాలి : రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోదండరెడ్డి
  • నల్గొండలో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిట్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2026

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలోని బత్తాయి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, నాణ్యమైన దిగుబడి, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. బత్తాయి రైతుల సమస్యలు, భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శనివారం నల్గొండలో నిర్వహించిన ‘స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిట్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2026’ కార్యక్రమానికి రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం. కోదండరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ బత్తాయి సాగులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో పేరుందన్నారు. 

జిల్లాలో బత్తాయి సాగుకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, వివిధ కారణాల వల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. 

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒడిదుడుకులు, నీటి సమస్యల కారణంగా  రైతులు బత్తాయి తోటలను తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని,  ఎప్పుడు వరిపైనే ఆధారపడకుండా బత్తాయితో పాటు ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడిపై తప్పనిసరిగా దృష్టి సారించాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. 

ఉద్యానవన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారని చెప్పారు. రైతులు పంట మార్పిడితో పాటు, ఉద్యానవన పంటలను సాగు చేయాలని, అవసరమైతే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగులో రైతుల సమస్యలు, భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతుల వంటి విషయాలపై చర్చిస్తామన్నారు. బత్తాయి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, దళారుల దోపిడీని అరికట్టేలా మార్కెటింగ్ వ్యవస్థను అత్యాధునికంగా మార్చి, బలోపేతం చేస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు, ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్ల ఏర్పాటుపై కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 ఈ సందర్భంగా బత్తాయి తోటలకు సోకే వివిధ రకాల తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండకాలంలో తోటలను కాపాడుకోవడానికి అనుసరించాల్సిన సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు పెంచడం, ఎగుమతుల ద్వారా లాభాలు ఆర్జించే మార్గాలను వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వివరించారు. 

కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే  రాంమోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డెయిరీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాపూజీ హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ వీసీ డి.రాజిరెడ్డి, రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యులు రాంరెడ్డి, చెవిటి వెంకన్న, పావనిరెడ్డితో పాటు పలువురు ఆఫీసర్లు, బత్తాయి రైతులు పాల్గొన్నారు. అనంతరం పలు స్టాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

రైతులు ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలి 

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాగు పద్ధతులను పాటంచాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేలా బిందు సేద్యం వంటి సాంకేతికతను వాడుకోవాలన్నారు. సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సూచనలు పాటిస్తూ నాణ్యమైన పండ్లను పండిస్తే అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు   - రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోదండరెడ్డి