TSRTCలో డ్రైవర్ ఉద్యోగాలు.. మొత్తం 1743 పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

TSRTCలో డ్రైవర్ ఉద్యోగాలు.. మొత్తం 1743 పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

తెలంగాణ స్టేట్ లెవల్​ పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు (టీఎస్ఎల్​పీఆర్​బీ) వివిధ విభాగాల్లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 28.

పోస్టుల సంఖ్య: 1743.

పోస్టులు: డ్రైవర్స్ (టీఎస్ఆర్​టీసీ) 1000, శ్రామిక్ (టీఎస్ఆర్​టీసీ) 743. 

ఎలిజిబిలిటీ: డ్రైవర్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 2025, జులై 1 కంటే ముందు పదోతరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 2025, సెప్టెంబర్ 17 నాటికి కనీసం 18 నెలలపాటు హెవీ ప్యాసెంజర్ మోటార్ వెహికల్(హెచ్​పీఎంవీ), హెవీ గూడ్స్ వెహికల్(హెచ్​జీవీ) లేదా ట్రాన్స్​పోర్ట్ వెహికల్​ను నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

శ్రామిక్ పోస్టులకు 2025, జులై 1 నాటికి డీజిల్/ మోటార్ వెహికల్ లేదా షీట్ మెటల్/ ఎంవీబీబీ లేదా ఫిట్టర్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కటింగ్/ కుట్టుపని/ అప్హోల్స్టర్ లేదా మిల్​రైట్ మెకానిక్​లో ఐటీఐ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏండ్లు. శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 08.

లాస్ట్ డేట్: అక్టోబర్ 28.   

అప్లికేషన్ ఫీజు: డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300. ఇతర అభ్యర్థులకు రూ.600. శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200. ఇతరులకు రూ.400. 

సెలెక్షన్ ప్రాసెస్: డ్రైవర్ పోస్టులకు శారీరక దారుఢ్య పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డ్రైవింగ్ టెస్టుకు 60 శాతం, పదోతరగతి లేదా సమాన అర్హతలో సాధించిన మార్కులు, డ్రైవింగ్ లైసెన్స్ అనుభవానికి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. కనీస అర్హత మార్కులు ఓసీ, ఈడబ్ల్యూఎస్​లకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.   

శ్రామిక్ పోస్టులకు అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఐటీఐ ట్రేడులో సాధించిన మార్కులకు 90 శాతం మెయిటేజీ, నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్(ఎన్ఏసీ) లో సాధించిన మార్కులకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. కనీస అర్హత మార్కులు ఓసీ, ఈడబ్ల్యూఎస్​లకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.   

శాలరీ: డ్రైవర్స్​కు రూ.20,860 – 60,080, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 – 45,030. 

పూర్తి వివరాలకు  www.tgprb.in వెబ్​సైట్​లో చూడవచ్చు.