అక్టోబర్ 24 నుంచి ఎస్ఏ ఎగ్జామ్స్

అక్టోబర్ 24 నుంచి ఎస్ఏ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 24 నుంచి  31 వరకు సమ్మెటివ్ అసెస్‌మెంట్​ (ఎస్​ఏ) పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం ఎగ్జామ్స్ టైమ్ టేబుల్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​ నవీన్ నికోలస్  రిలీజ్ చేశారు. ఫస్ట్ క్లాసు నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 6,8,9వ క్లాస్​ విద్యార్థులకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం12 వరకు పరీక్షలు జరుగుతాయి. టెన్త్ విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ, ఏడో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.