గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్ పథ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర, వేయి స్థంభాల గుడి థీమ్ తో రూపొందించిన శకటం చూసరులను ఆకట్టుకుంది. దీంతో పాటు గిరిజన కళాకారుల నృత్యాలు, గిరిజన సంస్కృతి చాటిచెప్పేలా బంజారా, కొమ్ముకోయ, గొండి నృత్యాలు ప్రత్యేకంగా నిలిచాయి. రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్రం వచ్చాక శకటాన్ని ప్రదర్శించడం ఇది రెండవసారి.
