హైదరాబాద్, వెలుగు: హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా 63వ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలోని హోంగార్డులు రైజింగ్ డే జరుపుకోవాలని డీజీపీ సూచించారు.
కాగా, రైజింగ్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని హోంగార్డులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు, సహజ మరణానికి రూ.5 లక్షల బీమా సహా పలు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
