
హైదరాబాద్, వెలుగు: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్-లో ఉన్నది. 2022–23కి సంబంధించి రూ.3.08 లక్షలతో మొదటి స్థానంలో నిలిచింది. రూ.3.01 లక్షలతో కర్నాటక రెండో స్థానంలో ఉంది. ఏపీ తలసరి ఆదాయం రూ.2.19 లక్షలుగా ఉందని పార్లమెంట్-లో కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాది రాష్ట్ర తలసరి రాబడి1.79 లక్షలుగా ఉంది.