నవంబర్ 17 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

నవంబర్ 17 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన
  • పలుచోట్ల రాహుల్, ప్రియాంక, ఖర్గే ప్రచారం
  • ఆరు రోజులపాటు రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ
  • చత్తీస్ గఢ్​, రాజస్థాన్, కర్నాటక సీఎంల పర్యటనలు
  • గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ

హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచ లీడర్ల వరుస పర్యటనలు ఖరారవుతున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి స్థానిక నేతలను దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 17 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 17వ తేదీన పాలకుర్తి, వరంగల్, భువనగిరి సభల్లో రాహుల్ గాంధీ పాల్గంటారు.

 ప్రతి శాసన సభ నియోజకవర్గంలో ఓ ముఖ్య నేత పర్యటించేలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. వీరితోపాటుచత్తీస్ గఢ్​, రాజస్థాన్, కర్నాటక సీఎంలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం 14 జిల్లాల డీసీసీ అధ్యక్షులు అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. జిల్లాను సమన్వయం చేసేందుకుగాను ఆ 14 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తున్నది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ALSO READ :- బాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు: సరోజావివేక్