హైదరాబాద్, వెలుగు: రాబోయే హాకీ ఇండియా లీగ్‌లో (హెచ్ఐఎల్)లో పోటీ పడే హైదరాబాద్ తూఫాన్స్ జట్టుకు తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారిక స్పాన్సర్‌గా ఉంటుందని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రతిగా రాష్ట్ర టూరిజం, కల్చర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తూఫాన్స్ జట్టు వ్యవహరిస్తుందని తెలిపారు. దీనివల్ల జాతీయ స్థాయిలో తెలంగాణ వారసత్వం, సంస్కృతి గురించి అందరికీ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్ తూఫాన్స్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీమ్ జెర్సీని ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు పతకాలు సాధించడమే లక్ష్యంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వస్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, తూఫాన్స్ టీమ్ పేయర్లు పాల్గొన్నారు.
