వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్–-2025 ప్రారంభం

వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్–-2025 ప్రారంభం
  • ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ టూరిజం స్టాల్స్​ 

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రావెల్ టూరిజం కార్యక్రమం వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) లండన్–-2025 బుధవారం ఎక్సెల్ లండన్‌‌‌‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్ఈ నెల 6 వరకు కొనసాగనున్నది. పర్యాటక రంగ భవిష్యత్తుపై చర్చకు ఇది వేదికగా నిలువనున్నది. డబ్ల్యూటీఎంలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌‌‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్‌‌‌‌లోని ఇండియా డిప్యూటీ కమిషనర్ కార్తీక్ పాండే ఈ స్టాల్‌‌‌‌ను ప్రారంభించారు. 

అంతర్జాతీయ పర్యాటక భవిష్యత్తు కోసం అజెండాను రూపొందించడంలో డబ్ల్యూటీఎం ముఖ్యమైన వేదికగా నిలుస్తున్నది. రాష్ట్రంలో అమలు చేయబోయే లేదా ప్రస్తుతం ఉన్న కలినరీ (వంటకాలు), హాట్ ఎయిర్ బెలూన్ వంటి ప్రత్యేక టూరిజం కార్యక్రమాల గురించి సంప్రదింపులు జరిగాయి. కాగా, తెలంగాణ టూరిజంతో కలిసి పని చేయడానికి 24 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని స్పెషల్​చీఫ్​సెక్రటరీ జయేశ్ రంజన్, టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు.