
- టీజీసీహెచ్ఈ చైర్మన్కు నిరుద్యోగ జేఏసీ నేత మానవతరాయ్ వినతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)నిర్వహించే గ్రూప్స్ పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు, చేర్పులపై నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. గురువారం టీజీ సీహెచ్ఈ చైర్మన్, సిలబస్ చైర్మన్ వి బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
గత ప్రభుత్వం అనుస రించిన పక్షపాత ధోరణి కారణంగా తెలంగాణ ఉద్యమంలోని కొన్ని కీలక ఘట్టాలను సిలబస్ నుంచి విస్మరించారని ఆరోపించారు. ఓయూ కేంద్రంగా జరిగిన పలు ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో, సిలబస్‌లో చేర్చాలని కోరారు.