కరీంనగర్ లో గ్రాండ్ గా తెలంగాణ వైభవం

కరీంనగర్ లో గ్రాండ్ గా తెలంగాణ వైభవం

తెలంగాణ వైభవం పేరుతో కరీంనగర్ లో ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు చివరిరోజుకు చేరుకుంది. ముగింపు వేడుకలకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. తెలంగాణ చరిత్ర, వైభవం, పాలన, మరుగున పడిన తెలంగాణ ప్రాంత విశేషాలను వివరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

సీఎం కేసీఆర్ నిజాం సమాది దగ్గర మోకరిళ్లాడని ఆరోపించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.  రజాకర్ల తూటాలకు బలైన వారి కుటుంబాలు సీఎంను చూసి సిగ్గుపడుతున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో పటేల్ ఫోటోను పెట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆయన్ను కించపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ గత చరిత్రను మరుగున పడే విధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.