
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుంకర నరేష్ ఓటర్ ప్రభుత్వానికి లెటర్ రాశాడు. గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నాడు. కేసీఆర్ ఆరోగ్యంపై పూర్తి వివరాలతో కూడిన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి లేఖను రాశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ ఇంకా కోలుకోలేదు. ముందు వైరల్ ఫీవర్తో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడు చెస్ట్ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘సీఎం కేసీఆర్కు కొద్ది రోజుల కింద వైరల్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు ఛాతిలో ఇన్ ఫెక్షన్ అయింది. ఇది బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది” అని ఆయన తెలిపారు.