కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకుంది : కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకుంది : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. బీజేపీ విజయ సంకల్ప సభలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 ఓటుబ్యాంకు రాజకీయాలతో తెలంగాణ ప్రజలను దోచుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని సూచించారు. కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Also read : కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా విజయం సాధించబోతున్నారని అన్నారు. తెలంగాణలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.